వన్డేలోకి తిలక్.. జడేజా ఔట్

17-10-2026 | 05:10am

హార్దిక్ పాండ్యా దూరం

చివరి రెండు వన్డేలకుకెప్టెన్‌గా శ్రేయాస్

కివీస్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లకు జట్టు ప్రకటన

ముంబై, అక్టోబర్ 16: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్ట్ టీంలను బీసీసీఐ(Board of Control for Cricket in India) ప్రకటించింది. టెస్టలతో పాటు తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ సార థ్యం వహించనుండగా.. చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేయనున్నాడు. టెస్ట్ సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన బీసీసీఐ.. ఐదు వన్డేల సిరీస్‌కు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. తొలి మూ డు వన్డేలకు రెగ్యులర్ టీంను సెలెక్ట్ చేసిన బీసీసీఐ.. చివరి రెండు వన్డేలకు టెస్ట్ ఆటగాళ్లను దూరంగా ఉంచింది.

టెస్ట్ సిరీస్ ప్రిపరే షన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనకు కూడా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వన్డేల్లో జడేజాకు మరోసారి అవకాశం దక్కలేదు.  కొత్తగా కుమార్ కుశాగ్రా చివరి రెండు వన్డేలకు ఎం పికవ్వగా.. యష్ ఠాకూర్‌కు  అవకాశం ద క్కింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. నితీష్ కుమార్ రెడ్డి వన్డేలతో పాటు టెస్ట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. చివరి రెండు వన్డేలకు తిలక్ వర్మ  ఎంపికయ్యాడు.

తొలి మూడు వన్డేల కోసం భారత వన్డే జట్టు

శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అంశుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గై క్వా డ్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీ పర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కు ల్దీప్ యాదవ్

చివరి రెండు వన్డేలకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్‌ధీర్, ఆకిబ్‌నబీ, గు ర్నూ ర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్షీదీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మ హమ్మ ద్ సిరాజ్, యష్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్

భారత టెస్ట్ జట్టు

శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్దత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అంశుల్ కం బోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

మరిన్ని వార్తలు