భువనేశ్వర్‌కు పిలుపు
- నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ
- కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక
ముంబై, అక్టోబర్ 6 : న్యూజిలాండ్(New Zealand)తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును(Indian team) ప్రకటించారు. ఊహించని విధంగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు(Bhuvneshwar Kumar) సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భువీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్‌పైనే ఆడాడు. యువ పేసర్ల రాకతో టీమిండియాకు భువీ దూరమయ్యా డు.
అయితే ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అ ద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడానికి భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అతను 28 వికెట్లు పడగొట్టాడు. తర్వాత దేశవాళీ టీ20 టోర్నీల్లో సైతం రాణించాడు. అప్పటి నుంచీ భువీని మళ్లీ తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.
కివీస్‌తో టీ20లకు భారత జట్టు : శ్రేయాస్ (కెప్టెన్), అభిషేక్, సంజూ శాంసన్, వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్, దూబే, నితీశ్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్, అర్షదీప్, భువనేశ్వర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్