ఒకరి కోసం రూల్స్ మార్చలేం
వినేశ్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat)కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) షాక్ ఇచ్చింది. 2026 సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాం పియన్‌షిప్ పోటీలకు సంబంధించి సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ దాఖలు చేసిన తాత్కాలిక పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది. గర్భధారణ, ప్రసవం, పోస్ట్-పార్టమ్ రికవరీ కారణంగా తాను గత కొన్ని పోటీలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వి నేష్ కోర్టుకు తెలిపింది. తాను నేరుగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయాలని కోరడం లేదని, కేవలం ట్రయల్స్‌లో పోటీపడే అవకాశం మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
డబ్ల్యూఎఫ్‌ఐ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను సాధించని అథ్లెట్‌కు కేవలం ఒకరి కోస మే నిబంధనలు సవరించి అనుమతి ఇవ్వ డం విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. నిబంధనలు పాటించిన మిగతా క్రీడాకారులకు ఇది తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్‌ఎ జారీ చేసిన సర్క్యులర్ అథ్లెట్లందరికీ సమానంగా వర్తిస్తుందని, ఒకరి కోసం నిబంధనలు మార్చలేమని చెప్పిన కోర్టు వినేష్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.