రిబకినాదే యూఎస్ ఓపెన్
ఫైనల్లో సబలెంకాకు షాక్
అదరగొట్టిన యువ సంచలనం
నెంబర్ వన్ ర్యాంక్ కైవసం
న్యూయార్క్, సెప్టెంబర్ 13: ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా(Elena Rybakina) కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్, బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా(Belarusian player Aryna Sabalenka)ను ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో కజకిస్థాన్ ప్లేయర్ రిబకినా.. 6- 5 6 తేడాతో సబలెంకాను ఓడించింది. దాంతో హ్యాట్రిక్ సాధించాలనే స బలెంకా ఆశలు నెరవేరలేదు.
తొలి సెట్ ను 4 కోల్పోయిన సబలెంకా, రెండో సెట్‌ను 7- గెలిచి రేసులోకి వచ్చింది. కానీ ఆఖరి సెట్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. రిబకినా అలవోకగా 6తో సెట్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ పరాజయంతో తీవ్ర అసహనానికి గురైన సబలెంకా తన రాకెట్‌ను విరగొట్టేసింది. 2024, 2025 ఎడిషన్లలో సబలెంకా ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. అందుకు తగ్గట్లుగానే ఫైనల్ చేరింది. కానీ రిబకినా అడ్డుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది.
మూడో గ్రాండ్ స్లామ్
రిబకినాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిట్స్‌తో పాటు నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్న రెండో ప్లేయర్‌గా రిబకినా నిలిచింది. 1995లో స్టెఫీగ్రాఫ్ ఈ ఘనతను అందుకుంది. 31 ఏళ్ల తర్వాత రిబకినా ఈ ఫీట్ సాధించింది. ఈ టోర్నీ జరుగుతుండగానే సబలెంకాను వెనక్కి నెట్టి రిబకినా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం ర్యాంకులను అధికారికంగా ప్రకటించనున్నారు. దాంతో 99 వారాల నుంచి తన వద్దే ఉన్న టాప్ ర్యాంక్ సబలెంకా నుంచి చేజారినట్ల యి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ ఏడాది సబలెంకా ఒక్క మేజర్ టైటిల్‌ను గెలవలేదు.