ఆయిల్ పామ్ వైపు అన్నదాతలు
రైతులను ప్రోత్సహిస్తున్న సర్కార్
ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఆయిల్ ఫాం పంటల వైపు అన్నదాతలు మోగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసుకోవాలని రైతులను ప్రోత్సహిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో పామ్ ఆయిల్ టన్ను గెలల ధర 22,000 ల రూపాయలు పలికింది. గతంలో కంటే ప్రస్తుతం రేట్లు ఎక్కువగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా(Peddpalli District) సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామాల్లో రైతులు 340 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుచేశారు.
గతంలో ఈ ప్రాంతంలో రైతులు ఈ ఆయిల్ ఫామ్ పంటలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు, ప్రభుత్వ విప్పు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Government Whip Vijaya Ramana Rao) ఆయిల్ ఫామ్ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని ప్రతి సమావేశంలో రైతులకు అవగాహన కలిగించడం తో పాటు ఆయన కూడా తన సొంత గ్రామం ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామం లో ఇటీవల నాలుగు ఎకరాలలో ఆయిల్ ఫామ్ వేశారు. ఆయిల్ ఫామ్ పంట తో అధిక లాభాలు సాధించవచ్చని ఇప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.,
ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు వస్తున్నాయి..
తనకున్న ఆరు ఎకరాల భూమిలో గతంలో వరి పంట పండిస్తున్నప్పుడు వచ్చే ఆదాయం కన్నా ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడం వల్ల రెట్టింపు ఆదాయం వస్తుంది. .తన 6 ఎకరాల పంటలో ఆయిల్ ఫామ్ తో పాటు అంతర్ పంటలైన టమాట, అరటి, వంకాయ, క్యాబేజీ, దోసకాయ, కాలీఫ్లవర్ కూరగాయలను పండిస్తూ అధిక లాభాలు సాధిస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహంతో సబ్సిడీ పొందుతూ లాభాలు వస్తున్నాయి.
రైతు గోపిడి, ప్రభాకర్ రెడ్డి
అంతర్ పంటలతో లాభాలు..
రైతులు ఒకపక్క ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తూనే అందులోనే ఇతర పంటలు పండిస్తూ అధిక లా భాలు సాధిస్తున్నా రు. , తాము రైతులకు పలమార్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అవగాహన కల్పిస్తున్నా ము. ఆయిల్ ఫామ్ తో పాటు కొంతమ ంది రైతులు అందులోనే వరి తో పాటు అంతర్ పంటలు పండిస్తు రైతులు లబ్ధి పొందుతున్నారు అన్నారు.
డీఏవో, పైడితల్లి