హ్యారీ కేన్‌కు బాలెన్ డి ఓర్ అవార్డు

28-10-2026 | 05:15am

లండన్, అక్టోబర్ 26 : ఇంగ్లాండ్ సాకర్ స్టార్ హ్యారీ కేన్(England soccer star Harry Kane) ఫుట్‌బాల్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక బాలెన్ డి ఓర్(Ballon d'Or) గెలుచుకున్నాడు.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ పురస్కారం అందుకున్న ఇంగ్లీష్ ప్లేయర్‌గా(English player) ఘనత సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె, స్పెయిన్ సంచలనం లామిన్ యమాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) కూడా పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కి నెట్టి హ్యారీ విజేతగా నిలిచాడు. 2001 తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. చివరిసారి  మైకేల్ ఓవెన్ బాలెన్ డి ఓర్ గెలుచుకున్నాడు.

ఇదిలా ఉంటే ఉత్తమ స్ట్రుకర్ అవార్డును కూడా హ్యారీ సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్స్‌కు ఈ అవార్డునిచ్చి సత్కరిస్తారు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా హ్యారీ కేన్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. బేయర్న్ మునిచ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు వరుసగా రెండు ట్రోఫీలు అందించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను మూడో స్థానంలో నిలిపాడు. ఈ మెగాటోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన హ్యారీ కేన్ 6 గోల్స్ చేయడంతో పాటు ఒక అసిస్ట్ అందించాడు.

మరిన్ని వార్తలు