భారత్ టార్గెట్ ఇదే!

06-10-2026 | 08:45pm

లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా(TeamIndia) బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్(West Indies) 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి 172 పరుగుల లక్ష్యం ముందుంది.

వెస్టిండీస్ తరఫున షై హోప్ అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును 170 మార్క్ దాటించాడు. భారత బౌలర్లలో నామన్ ధీర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు పడగొట్టారు. 172 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఛేజింగ్‌కు దిగనుంది.

మరిన్ని వార్తలు