భారత్ మహిళల శుభారంభం

17-10-2026 | 05:00am

తొలి టీ20లో జింబాబ్వేపై విజయం

రాయ్ పూర్, అక్టోబర్ 16 : భారత మహిళల జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మందాన(Smriti Mandhana) సారథిగా శుభారంభం చేసింది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. వా రి జట్టులో షార్నే మైయర్స్ (43), కెలిస్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో నం దిని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్, శ్రీచరణి, అరుంధతీ రెడ్డి తలా ఒక వికెట్ సాధించారు.

115 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 19 పరుగు లకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టె న్ స్మృతి మంధాన(9), షెఫాలీ వర్మ(4), అనుష్క శర్మ(4), హర్మన్‌ప్రీత్ కౌర్(1) తీవ్రం గా నిరాశపర్చారు. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మ, నికీ ప్రసాద్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికె ట్‌కు 82 పరుగులు జోడించారు. భారత్ 15.4 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి గెలుపొందింది. నికీ ప్రసాద్(35 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్), దీప్తి శర్మ(37 బంతు ల్లో 8 ఫోర్లతో 49) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యాశా గ్వాంజుర(3/18) మూడు వికె ట్లు తీయగా.. మిచెల్లా మావుంగా, చేర్, బిజా తలో వికెట్ తీసారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు