ఇషా సింగ్ బృందానికి పసిడి

11-11-2026 | 05:10am

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్

హాంగ్‌చౌ, నవంబర్ 10: ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో(ISSF World Championship) భారత్ సత్తా చాటింది. తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇషా, మను బాకర్, దివ్యల త్రయం ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత బృందం 1761 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

దక్షిణకొరియా 1748 పాయింట్లతో రెండో స్థానంలోనూ, 1745 పాయింట్లతో వియాత్నాం మూడో స్థానంలోనూ నిలిచాయి. కాగా ఇదే పోటీల్లో ఇషా సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే భారత మహిళా షూటర్లకు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ బెర్త్ దక్కలేదు. 

మరిన్ని వార్తలు