అరంగే ట్రంలోనే డబుల్ హ్యాట్రిక్

23-11-2026 | 05:10am
  1. చరిత్ర సృష్టించిన జంషెడ్ ఆలం
  2. 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రైల్వేస్ పేసర్

ఇండోర్, నవంబర్ 22: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy) 2026- ఓ అరుదైన రికార్డు నమోదైంది. రైల్వేస్ యువ పేస ర్ జంషెడ్ ఆలం అరంగేట్రంలోనే డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో జం షెడ్ అదరగొట్టాడు.ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో బంతిని అందుకున్న జంషెడ్ వరుసగా 4 బంతుల్లో హార్విక్ దేశాయ్, ప్రేరక్ మంకడ్, రుచిత్ అహిర్, సమ్మర్ గజ్జర్లను ఔట్ చేశా డు.

అనంతరం 6వ ఓవర్లో సిద్ధార్థ్ రాణాను ఔట్ చేసి 5 వికెట్ల మార్కు ను చేరుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా జంషెడ్ నిలిచాడు. ఇంతకు ముందు అభిమన్యు మిథున్ (2019), దర్శన్ నల్కండే (2021) మాత్రమే భారత్ తరఫున ఈ ఘనత సాధించారు.

టీ20 అరంగేట్రం మ్యాచ్లోనే 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. కాగా తన స్పెల్‌లో కేవలం 9 బం తుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టాడు. అంతర్జా తీయ టీ20 చరిత్రలో ఇండోనేషియా బౌల ర్ గెడె ప్రియాందన (6 బంతు లు), ఫిన్లాండ్ బౌలర్ మహేష్ తాంబే (8 బంతులు) తర్వాత అత్యంత వేగంగా 5 వికె ట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కా డు. జంషెడ్ ఆలం అద్భుత బౌలింగ్తో రైల్వేస్ జట్టు సౌరాష్ట్రపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు