ప్రియాన్షు మోలియా ట్రిపుల్ సెంచరీ
79 ఏళ్ల రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ రౌండప్
వడోదర, అక్టోబర్ 27 : రంజీ ట్రోఫీలో(Ranji Trophy) బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా(Priyanshu Molia) (21) చరిత్ర సృష్టించాడు. జమ్మూ కశ్మీర్‌తో(Jammu and Kashmir) జరుగుతున్న మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ(Triple Century) సాధించాడు. తద్వారా బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 79 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1947లో గుల్ మహమ్మద్ చేసిన 319 పరుగుల నేటి వరకు బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ కికెట్లో(first-class cricket) అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. తాజాగా ఈ రికార్డును ప్రియాన్షు బద్దలు కొట్టాడు.
492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహేశ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మహేశ్ తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ సాధించాడు. ప్రియాన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది.
21 ఏళ్ల 132 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రియాన్షు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో అతి పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు.మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 174 పరుగుల తేడాతో బిహార్‌పై ఘనవిజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 99 పరుగులకే ఆలౌటైంది. సరాన్ష్ జైన్ 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 407 పరుగులకు డిక్లేర్ చేసింది. తర్వాత సరాన్ష్ జైన్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లోనూ బిహార్ కుప్పకూలింది. సరాన్ష్ మొత్తం 13 వికెట్లతో అదరగొట్టాడు.