పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన భద్రాచలం వాసి

17-10-2026 | 05:05am

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శంకర్ రావుకు కాంస్యం 

భద్రాచలం, అక్టోబర్ 16, (విజయక్రాంతి): సంకల్పబలానికి వయసు అడ్డు కాదని, గుండెకు బైపాస్ సర్జరీ జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలంగాణకు చెందిన 74 ఏళ్ల సీనియర్ అథ్లెట్ డివి శంకర్ రావు(DV Shankar Rao) నిరూపించారు. గుండెకు జరిగిన బైపాస్ సర్జరీని సైతం లెక్కచేయకుండా, తన సంకల్ప బలంతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆయన అమెరికా వేదికగా జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని  కైవసం చేసుకున్నారు.

భద్రాచలానికి చెందిన ప్రముఖ సిటీ స్టైల్ జిమ్ సెంటర్‌లో కోచ్ జి.వి. రామిరెడ్డి పర్యవేక్షణలో శంకర్ రావు ఈ పోటీల కోసం కఠిన మైన శిక్షణ తీసుకున్నారు. జాతీయ స్థాయి లో పలు పతకాలు, రికార్డులు సాధించిన ఆ యన, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిం చి ప్రపంచ పోటీలకు వెళ్లి ఈ ఘనవిజయం అందుకున్నారు. వృద్ధాప్యంలోనూ, శారీరక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ ఆయన సాధించిన ఈ విజయం పట్ల భద్రాచలం ప్రాంతంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు