యుకీ జోడీదే అల్మటీ ఓపెన్

26-10-2026 | 05:20am

న్యూఢిల్లీ, అక్టోబర్ 25 : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ(Indian tennis star Yuki Bhambri) అల్మటీ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అమెరికన్ ప్లేయర్ ర్యాన్ సెగర్మాన్‌తో కలిసి ఈ విజయాన్ని అందుకున్నాడు.నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన బాంబ్రీ జంట ఫైనల్లో టాప్ సీడ్ ఆస్ట్రియా జోడీ లూకాస్ మీడ్లర్ నీల్ ఒబెర్లీట్లర్‌కు షాకిచ్చింది.

హోరాహోరీగా సాగిన పోరులో 7 6 10 స్కోరుతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి సెట్ నుంచి ఇరు జోడీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. మొదటి సెట్‌ను టై బ్రేక్‌లో యువీ జోడీ గెలవగా, కాసేపటికే ప్రత్యర్థి జోడీ స్కోరు సమం చేసింది. నిర్ణయాత్మక మ్యాచ్ టై బ్రేక్‌లో యుకీ జోడీదే పైచేయిగా నిలిచింది.

అంతకుముందు సెమీఫైనల్స్‌లో జాక్సన్ విత్రో - నథానియల్ లామన్స్ (అమెరికా)లపై ఈ జోడీ అద్భుత విజయం సాధించింది. యుకీ బాంబ్రీ కెరీర్‌లో ఇది 5వ ఏటీపీ టూర్ డబుల్స్ టైటిల్. అలాగే 2026 సీజన్‌లో ఇదే మొదటి ఏటీపీ. ఆసియా క్రీడల్లో పతకం గెలవక నిరాశలో ఉన్న తనకుతాజా టైటిల్ విజయం గొప్ప సంతోషాన్నిచ్చిందని యుకీ చెప్పాడు.

మరిన్ని వార్తలు