ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దళారుల చేతిలో మోసపోవద్దు.. ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
చివ్వెంల, నవంబర్ 27 (విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని బధ్యతండ లో హాకా రైతు సేవా కేంద్రం(Farmers Service Centre) (PPC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, సర్పంచ్ బానోత్ సైదా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ముఖ్యంగా సన్నధాన్యం పండించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్క కృష్ణారెడ్డి, రైతులు మండవ లక్ష్మీనారాయణ, మండవ నాగరాజు, గునుగుంట్ల సైదులు, ధరావత్ లచ్చు, ధరావత్ శ్రీను, సురభి గురుస్వామి, ధరావత్ సుమన్, బానోత్ శోభన్, ధరావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.