29న దీక్షా దివాస్.. విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతల పిలుపు

27-11-2026 | 02:11pm

 తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ బహిరంగ సభ(Deeksha Divas Public Meeting) గురించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణా రెడ్డి, మాజీమహిళా అధ్యక్షురాలు మోర నిర్మల నర్సయ్య, , మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మని రాజశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, వేణుగోపాలరావు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు