నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరకు పెరుగుదల
బోధన్,(విజయక్రాంతి): నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Nizamabad Agricultural Market Committee)లో పసుపు ధరలు(Turmeric Prices) పెరిగాయి. గురువారం మార్కెట్‌లో పసుపు మోడల్ ధర క్వింటాలుకు రూ.20,800కు చేరింది. బుధవారం క్వింటాలుకు రూ.19,500గా ఉన్న మోడల్ ధర ఒక్కరోజులోనే రూ.1,300 పెరిగింది. అయితే గరిష్ఠ ధర మాత్రం బుధవారం రూ.23,160 ఉండగా గురువారం రూ.21,366కు తగ్గింది.
మరోవైపు కనిష్ఠ ధర రూ.14,009 నుంచి రూ.15,500కు పెరిగింది. పసుపు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇదిలా ఉండగా మార్కెట్‌కు పసుపు రాకలు భారీగా తగ్గాయి. బుధవారం 526 క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు రాగా, గురువారం కేవలం 146 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ధర పెరిగినప్పటికీ మార్కెట్‌కు పసుపు రాకలు తగ్గడం రైతులు, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.