గణేష్ నవరాత్రుల్లో డీజేలకు నిషేధం

08-09-2026 | 07:55pm

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై మహేష్ హెచ్చరిక

చివ్వెంల: రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు(Vinayaka Navratri celebrations), శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చివ్వెంల పోలీస్ స్టేషన్(Chivvenla Police Station) పరిధిలో డీజే సిస్టమ్స్ వినియోగంపై నిషేధం విధించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. గణేష్ మండపాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలకు డీజే సిస్టమ్స్‌(DJ Systems)ను అద్దెకు ఇవ్వకూడదని, వినియోగించకూడదని యజమానులకు స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి డీజేలను ఏర్పాటు చేసినా లేదా సరఫరా చేసినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులందరినీ చట్ట నిబంధనలకు కట్టుబడి ఉండేలా బౌండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై మహేష్ కోరారు.

మరిన్ని వార్తలు