నయానగర్లో ఘనంగా కనకదుర్గమ్మ శోభాయాత్ర
21-10-2026 | 06:13pm
కోదాడ అక్టోబర్ 21(విజయక్రాంతి) : కోదాడ పట్టణంలోని(Kodad town) 14వ వార్డులో కనకదుర్గమ్మ శోభాయాత్ర(Kanakadurgamma Procession) బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించిన ఈ శోభాయాత్రలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల(devotees) కోలాహలం మధ్య శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.