మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

11-09-2026 | 02:29pm

నేరేడుచర్ల,సెప్టెంబర్ 11(విజయ క్రాంతి):సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల(Nereducherla) పట్టణంలోని  పినాకిల్ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలకు స్వస్తి పలికి, పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను పినాకిల్ పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేశారు.

పాఠశాల ఉపాధ్యాయ బృందం మార్గదర్శకత్వంలో విద్యార్థులే స్వయంగా మట్టిని సేకరించి, అత్యంత నైపుణ్యంతో ఈ విగ్రహాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పినాకిల్ పాఠశాల విద్యార్థులు నేరేడుచర్ల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో మట్టి వినాయక విగ్రహాలు, పర్యావరణ నినాదాల ప్లకార్డులు పట్టుకుని పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు ఇంటింటికీ తిరుగుతూ మట్టి వినాయక విగ్రహాల ప్రాముఖ్యతను, రసాయన విగ్రహాల వల్ల జరిగే నష్టాలను పట్టణ ప్రజలకు వివరించి, అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు