గుంతల ప్రయాణం.. అనుక్షణం భయం!

28-10-2026 | 05:10am

దెబ్బతిన్న తిమ్మాపురం-రామచంద్రాపురం రహదారి

బీటీ రెన్యువల్ కోసం సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం మండలాల ప్రజల ఎదురుచూపు

రెండు వరుసల రోడ్డుగా విస్తరించాలని వేడుకోలు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 27 : జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట(Suryapet-Jajireddygudem) రెండు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే తిమ్మాపురం- రామచంద్రపురం రహదారి(Thimmapuram-Ramachandrapuram road) పూర్తిగా దెబ్బతిన్నది.ఈ సింగిల్ రోడ్డుపై బీటీ లేచిపోయి, పలుచోట్ల గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంటే తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) మొట్ట మొదటిసారిగా నిర్మించిన ద్వాదశ అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి(Lord Suryanarayana) క్షేత్రం కూడా ఉంది. ఈ క్షేత్రానికి ఈ రహదారి గుండా నిత్యం వందలాది మంది భక్తులు(devotees) రాకపోకలు సాగిస్తుంటారు.

అలాగే జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రెండు మండలాలకు ఇది దగ్గరి దారి కావడంతో నిత్యం తిమ్మాపురం, జ్యోతులనగర్, సోలిపేట, రామచం ద్రపురం, రత్నపురంతో పాటు పలు గ్రామా ల ప్రజలు ఇక్కడినుండే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న రహదారికి కొన్నే ళ్లుగా ఎలాంటి మరమ్మత్తులు లేకపోవడం తో పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రయాణానికి ప్రజలు అనుక్షణం భయపడుతున్నారు.                    

రోడ్డు విస్తరణతోనే పరిష్కారం 

జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం ఆవాసం జ్యోతులనగర్ వద్దనున్న 365(బీ) రహదారిపై నుంచి సూర్యాపేట మండలం సోలిపేట శివారు వరకు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాగా సోలిపేట నుంచి సూర్యాపేట మండలం టేకుమట్ల (హైదరాబాద్ - విజయవాడ హైవే) వరకు రహదారి ని రెండు వరుసలుగా విస్తరించారు. అలాగే సోలిపేట నుంచి జ్యోతులనగర్ వరకు కూ డా ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును రెండు వరుసల రహదారిగా విస్తరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని రెండు మండలాల ప్రజలు అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చే శారు. ప్రస్తుతం జ్యోతులనగర్ నుంచి సోలిపేట వరకు ఉన్న బీటీ సింగిల్ రోడ్డును రెన్యువల్ చేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది..

సూర్యాపేట- జనగామ 365(బీ) జాతీయ రహదారిపై గల తిమ్మాపురం ఆవాస గ్రా మం జ్యోతులనగర్ సమీపంలోని హైవే వద్ద నుంచి సోలిపేట వరకు ఉన్న సింగిల్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని బీటీ లేచిపోయి, గుంతలు మయంగా మారింది. ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బీటీ రెన్యువల్ చేయా లి. అప్పుడే ఇబ్బందులు తొలగిపోతాయి.                                

 జ్యోతుల సత్తయ్య, జ్యోతులనగర్

మరిన్ని వార్తలు