పంతంగిలో నూతన సీసీ కెమెరాల ఏర్పాటు
చౌటుప్పల్, అక్టోబర్ 6: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరాల ఛేదనకు ఉపయోగపడేలా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు(CCTV Cameras Installed) చేశారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజలు పోలీసులకు సహకరిస్తూ తమ పరిసరాల్లో భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డి. నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.