యాదగిరిగుట్టలో బతుకమ్మ కుంట ఏర్పాటు

10-10-2026 | 09:50pm

మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ సంబరాల కోసం పాత హై స్కూల్ గ్రౌండ్ లో బతుకమ్మ కుంట ను మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్(Municipal Chairperson Gundlapalli Vani Bharat Goud) ఏర్పాట్లని చేశామని తెలిపారు. స్థానిక మహిళలు బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఉత్సాహంగా జరుపుకునేందుకు బతుకమ్మ కుంట సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాత హై స్కూల్ గ్రౌండ్ లో మహిళలకు బతుకమ్మ ఆటపాటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

బతుకమ్మ ఆటపాటలు ఆడుకొని అక్కడే బతుకమ్మల నిమజ్జనం సౌకర్యవంతంగా చేసేందుకు గ్రౌండ్‌లోనే ప్రత్యేక తాత్కాలిక బతుకమ్మ కుంటను సిద్ధం చేశామని తెలిపారు. ఇందుకోసం గ్రౌండ్ లో  విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టంను  ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు పాల్గొన పండుగ వాతావరణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యం మరియు తాగునీరు తదితర మౌలిక వసతులను కల్పించడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు