అబ్దుల్ కలాం గొప్ప మేధావి ఆయన నేటి సమాజానికి ఆదర్శం
11-11-2026 | 01:59pm
బోథ్. నవంబర్ 11 (విజయ క్రాంతి) స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) గొప్ప మేధావి అని ఆయన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన దేశ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రపతిగా ఎంతో సేవ చేశారన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అశోక్ కుమార్. తోపాటు కార్యాలయ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు