30వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
11-11-2026 | 01:03pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం, 60 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం (National Health Mission) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే మౌఖిక హామీలను తాము నమ్మబోమని స్పష్టం చేశారు.
తమ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి స్పష్టమైన లిఖితపూర్వక ఉత్తర్వులు (జీవో) జారీ చేసే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.