రామచంద్రపురంలో ఘనంగా సదర్ ఉత్సవాలు..
రామచంద్రాపురం నవంబర్ 11: రామచంద్రపురం డివిజన్(Ramachandrapuram Division) పరిధిలోని ఆదివారం మార్కెట్ సమీపంలో రాగం రమేష్ ఆధ్వర్యం లో ఘనంగా సదర్ ఉత్సవాలు(Sadar Utsavs) జగుపబడ్డయ్.
ఈ సదర్ ఉత్సవాల్లో ముఖ్యతిధులుగా మాజీ ప్రొటెం స్పీకర్ వి.భూపాల్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి,నవీన్ యాదవ్ జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే,రాష్ట్ర కురుమ గొల్ల అధ్యక్షులు రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,శేరి లింగంపల్లి మాజీ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్,డివిజన్ బీజేపీ అధ్యాక్షులు నర్సింగ్ గౌడ్,పటాన్ చెరు సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్,ఐలేష్ యాదవ్,బైకన్ నవీన్ యాదవ్ తధితరులు పాల్గొన్నారు.
ఈ సదర్ ఉత్సవాల్లో భగంగా దున్నాలను ఆడించిన యాదవ్ సోదరులు ఊరేళ్ల రాజు,శివ యాదవ్ ఇతర యాదవ్ సోదరులు.ఈ సందర్బంగా రమేష్ యాదవ్ మాట్లాడుతు తారలుగా వస్తున్నా ఈ యాదవ సంప్రదాయం ఎంతో గొప్పది శ్రీ కృష్ణుని వారసులం మల్లన స్వామి కుల దైవం అవడం మాకు ఎంత అదృష్టం అని రామచంద్రపురంలో అందరం యాదవులు కలిసిమెలిసి ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకునే పండుగ ధున్న లను మా ఇంట్లో ఒకరిలా చూసుకుంటాం అని పాడి పశువులే మా జీవనధారం కాబట్టీ వారికి పూజలు చేసి ఈ వేడుకను జరుపుకుంటాం అందరం యాదవ్ సోదరులం ఒక్క దగ్గిరకి వచ్చి పండుగ సంబురాలు జరుపుకుంటాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బైకన్ సాయిలు యాదవ్,రాగం శ్రవణ్ యాదవ్, బైకన్ నవీన్ యాదవ్, భాస్కర్, రాములు యాదవ్, రాగం సోమయ్య, సోమేష్, రామచందర్ యాదవ్, ఊరెళ్ళ రాజు, యాదవ్ కులస్తులు, ప్రజలు, పాల్గొన్నారు.