నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను నిర్మించాలి
బోథ్. నవంబర్ 11 (విజయ క్రాంతి) ఎల్ నినో(El Niño), పరిస్థితులను తట్టుకునేందుకుగాను వి బి జి రాంజీ మెట్లు గ్రామాల(V B G Ramji Metlu Village) ప్రజలను చైతన్యం చేయాలని అందులో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకునే విధంగా కృషి చేయాలని బోథ్ ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో వి బి జి రాంజీ మెట్లకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 60 మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇప్పించాలన్నారు. బోర్ వెల్స్ వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో జగ్జీరావు టీఏ లు ఎఫ్ఏ లు ఉన్నట్లు పాల్గొన్నారు.