రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఇంజిన్‌, ఏడు బోగీలు

11-11-2026 | 10:07am

అసోం: రాష్ట్రంలో భారీ రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. డిగరూ సమీపంలో సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (Sairang Express) పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రైలు పట్టాలు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా రెండు రైల్వే మార్గాలు (Railway Tracks) దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue Operations) చేపట్టాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు