రిమ్స్ లోని పలు వార్డులను పరిశీలించిన జిల్లా వైద్యాధికారిని

21-11-2026 | 07:16pm

ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రిమ్స్ ఆసుపత్రి(RIMS Hospital) లోని తల్లుల, చంటి పిల్లల, అత్యవసర సేవల(emergency services) విభాగాన్ని జిల్లా వైధ్య, ఆరోగ్యశాఖాధికారి డా. సాధన(Dr. Sadhana) సందర్శించారు. [MNICU) వార్డుకు సంబంధిత అంశాలు, సిబ్బంది వివరాలు, అందుబాటులో ఉన్న అత్యవసర ఆధునిక సాంకేతిక పరికరాలు(Modern technological devices) పరిశీలించారు. అనంతరం నోడల్ అధికారి డాక్టర్ వంశీ(Nodal Officer Dr. Vamsi) తో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి చర్చించారు. ఆమె వెంట జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డా వై.సి శ్రీనివాస్, జిల్లా అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ అధికారి డా.వంశీకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు