ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తప్పని సరి

21-11-2026 | 06:59pm

డాక్టర్ నిఖిత 

సిర్గాపూర్ నవంబర్ 21(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ PHC(Sirgapur PHC) లో డిప్యూటీ డిహెచ్ఎంవో Dr.నర్సింగ్ చోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ నిఖిత మాట్లాడుతూ...ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ నిఖిత సూచించారు. పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించేందుకు పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు.

పోలియో వ్యాధి చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం నిర్వహించే పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు నిర్ణీత సమయంలో పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ నిఖిత పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు