గణపురం లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

21-11-2026 | 06:56pm

గణపురం, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవం(World Fisheries Day), ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కృష్ణస్వామి మాట్లాడుతూ ఎలినో ప్రభావంతో జిల్లాలోని పలు చెరువులు, కుంటల్లో నీరు లేక చేప పిల్లల పంపిణీ జరగడం లేదన్నారు.

ఘనపసముద్రం, వంగపల్లి, భీమ్ గణపురం, ధర్మరావుపేట చెరువుల్లో నీరు పూర్తిస్థాయిలో ఉన్నందున ప్రభుత్వం 100 శాతం చేప పిల్లలు పంపిణీ చేయాలని కోరారు. ముదిరాజులకు నీలం మధు ముదిరాజ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి(MLC position) ఇవ్వాలని, బీసీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(జయశంకర్ భూపాలపల్లి) కేంద్రంలో పండుగల సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును(MLA Gandra Satyanarayana Rao) కోరారు.

ఈ కార్యక్రమంలో గుల్ల రాజకుమార్, మధ్యల విజయ అశోక్, జోడు ప్రదీప్, ఆకుల తిరుపతి, బోళ్ల బాలకృష్ణ, మాల వంశీ, పెండ్యాల వెంకటేష్, మాల రమేష్, అల్లం రవీందర్, తేలు రామచందర్, ఆకుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు