నూతన సొసైటీ తో మంచి ప్రయోజనాలు

21-11-2026 | 06:53pm

తాడ్వాయి,నవంబర్,21( విజయక్రాంతి ): నూతన సొసైటీ(New Society) ఏర్పాటుతో రైతులకు(Farmers) మంచి ప్రయోజనాలు కలుగుతాయని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజిగారి సుధాకర్ రావు(Santajigari Sudhakar Rao, Chairman of the Taduwai Single Window) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం(Primary Cooperative Society) లో శనివారం రైతులకు నూతన సభ్యత్వ నమోదు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సొసైటీలో మొత్తం 750 మంది రైతులు ఉంటారని తెలిపారు. ఒక్కో రైతు రూ.2 వేలతో సభ్యత్వం తీసుకోవాలన్నారు.

రైతుల డబ్బులు మొత్తం రూ.15 లక్షలు కాగా, మరో రూ.15 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు.ఈ సొసైటీలో మొత్తం 30 లక్షలు  నిధులు జమ అవుతాయన్నారు. ఈ నిధులతో వ్యాపారం చేసుకుని సొసైటీ సభ్యులు మంచి లాభాలు ఆర్జించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ అధికారి నగేష్,సింగిల్ విండో కార్యదర్శి నరసింహులు, సిబ్బంది నితేష్ రెడ్డి, శ్రీకాంత్, బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు