బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

21-11-2026 | 05:42pm

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం(Maheshwaram)లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఉద్రిక్తతకు వేదికగా మారింది. మంత్రి సీతక్క(Minister Seethakka), మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) సమక్షంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగి ఘర్షణకు దిగారు.

కార్యక్రమంలో కేఎల్ఆర్, చిగురింత పారిజాతం వేదికపై కూర్చోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Workers) అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఏ హోదాలో వారికి వేదికపై చోటు కల్పించారంటూ ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో కొద్దిసేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల కార్యక్రమం(Welfare Schemes Program) రాజకీయ వివాదంతో రసాభాసగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు