పెన్షనర్ల కొత్త ఆరోగ్య పథకానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి

21-11-2026 | 07:12pm

బాన్సువాడ డివిజన్‌లో 819 మందికి గాను 409 మంది మాత్రమే దరఖాస్తు...

మిగిలిన 381 పెన్షనర్లు స్పందించాలి...

డిసెంబర్ 2, 3 తేదీల్లో అవగాహన కార్యక్రమం : ఏటీఓ జగన్

బాన్సువాడ, నవంబర్ 21 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగులు(Retired employees), పెన్షనర్ల(Pensioners') కొత్త ఆరోగ్య పథకానికి(Health Scheme) అర్హులైన వారందరూ తప్పనిసరిగా దరఖాస్తు(Application) చేసుకోవాలని బాన్సువాడ అసిస్టెంట్ ట్రెజరీ అధికారి జగన్(Assistant Treasury Officer Jagan) సూచించారు. జిల్లా ఖజానా అధికారి ఆదేశాల మేరకు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 2, 3 తేదీల్లో బాన్సువాడ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

బాన్సువాడ డివిజన్ పరిధిలో మొత్తం 819 మంది పెన్షనర్లు ఉండగా, ఇప్పటివరకు 409 మంది మాత్రమే ఆరోగ్య పథకానికి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మిగిలిన 381 పెన్షనర్లు కూడా ఆలస్యం చేయకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న పాత వారు సైతం ప్రస్తుత నూతన ప్రక్రియలో భాగంగా కొత్త దరఖాస్తుదారులతో కలిసి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా నవంబర్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఏటీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పెన్షనర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పథకంలో నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ ట్రెజరీ అధికారి జగన్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు