బీవీఆర్‌ఐటీలో ఎఫ్‌పీజీఏ కనెక్ట్–2026
సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలపై పరిశ్రమ నిపుణుల చర్చ
నర్సాపూర్, నవంబర్ 21: నర్సాపూర్‌లోని(Narsapur) బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ(BVRIT))లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(Electronics and Communication Engineering) విభాగం ఆధ్వర్యంలో ఎఫ్‌పీజీఏ కనెక్ట్–2026 పేరిట పరిశ్రమ–విద్యా సంస్థల సమ్మేళనాన్ని శనివారం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో ఎఫ్‌పీజీఏల వినియోగం, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్తు అవకాశాలపై పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు చర్చించారు.
ఈ కార్యక్రమానికి ఏఎండీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చురివాలా, వానిక్స్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, సాంకేతిక విభాగాధిపతి డా. ముద్దసాని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైక్రోచిప్, ఇంటెల్, లాటిస్ సెమీకండక్టర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొని సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, పరిశ్రమ అవసరాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.