ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

16-10-2026 | 04:50pm

భైంసా (విజయక్రాంతి) : భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి(Area Hospital) జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Mishra) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఆయాబార్డుల్లో రోగులకు(patients') అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది హాజరు పట్టిక(staff attendance table) పరిశీలించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాలపై అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి కాశీనాథ్, తాసిల్దార్ శశిభూషణ్, మున్సిపల్ కమిషనర్ సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు