కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు... ఎండుతున్న పంటలు..

16-10-2026 | 04:52pm

కాంగ్రెస్ వైఫల్యం పై  బీ ఆర్ఎస్ నాయకుల విమర్శ...

ఉట్నూర్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత  ఆ ప్రకటిత  విద్యుత్ కోతలతో  ఆరు కాలం కష్టపడి  పండించిన పంటలు ఎండిపోతున్నాయని  బీ ఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ  మండల కేంద్రాలలో  బీ ఆర్ ఎస్ మండల కమిటీ(BRS Mandal Committee) అధ్యక్షులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ , ఇంద్రవెల్లి  మండల శాఖ అధ్యక్షులు  పంద్రా జై వంతరావు, మారుతి డోంగ్రే  లు మాట్లాడుతూ... విద్యుత్ కోతలతో  చేతికంచిన పంటలు  కండ్ల ముందే ఎండిపోతున్నాయని, గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు  కాలిపోతున్నాయని  ఆరోపించారు. రాత్రి వేళలో విద్యుత్ సరఫరా చేయడంతో విషపురుగుల భారీ నుండి  ప్రాణాలు రక్షించుకొనుటకు  రైతులు చేనులకు వెళ్లడం లేదని అన్నారు.

దినంలో సరఫరా చేసే విద్యుత్ వల్ల  విద్యుత్ మోటార్లు  కాలిపోతున్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ ని నో ప్రభావం కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే  ఇందుకు  నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ ని నో ప్రభావం అంటూ   ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని  వారు ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని  24 గంటలు విద్యుత్ సరఫరా చేయకుంటే  తమ పార్టీ ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వారితోపాటు  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు