చుంచుపల్లి పి హెచ్ సి లో ఐటీడీఏ పీఓ తనిఖీలు..

16-10-2026 | 04:56pm

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary Health Centre)  ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం సందర్శించి, అక్కడి వైద్య సేవలు, పారిశుద్ధ్య పరిస్థితులు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలు, రిజిస్టర్లు, వ్యాక్సిన్ల నిల్వ కోసం ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్ తదితర అంశాలను పరిశీలించి,

వాటి నిర్వహణకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు.

మరిన్ని వార్తలు