జిల్లా వ్యాప్తంగా గాంజా గస్తీ స్పెషల్ డ్రైవ్
నిర్మల్ నవంబర్ 25 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గాంజాగస్తి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila), ఏఎస్పి సాయికిరణ్, డి.ఎస్.పి శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్యతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి గాంజాను విక్రయించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తులు విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అది చట్టరీత్యా నేరమని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం దుకాణాలను తనిఖీ చేసి నోటీసులు అందించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించవద్దని చెప్పారు. పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు