రోడ్డును శుద్ధి చేయడం దొర అహంకారానికి నిదర్శనం

11-09-2026 | 01:02pm

బిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం

బోథ్. సెప్టెంబర్ 11 (. విజయ క్రాంతి): దళితులు నడిచారని ఎర్రవేల్లి ఫామ్ హౌస్ లో రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దొర అహంకారానికి నిదర్శనమని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న విమర్శించారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలో బిఆర్ఎస్(BRS) పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవనీయ స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానించే విధంగా బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడం సిగ్గుచేటు అన్నారు. తమ అహంకారాన్ని విడవాలని హితవు పలికారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జోంగాల భోజన ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బీమ్ రావు పాటిల్ కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి, కసిరి పోతన్న, మాజీ సర్పంచ్ రాందాస్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమృత రావు, మునేశ్వర్ చంద్రకాంత్, సోయం రమేష్ కే శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ గాండ్ల సాయన్న ,చరణ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు