సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు

16-10-2026 | 06:27pm

ఎర్రుపాలెం అక్టోబర్ 16 (విజయ క్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Sri Venkateswara) వారి దేవస్థానం జమలాపురం నందు ఆలయ కార్యనిర్వాహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించుచున్న  శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు( Sharannavaratri Festival) నేడు 6వ రోజు ఉత్సవంలో భాగంగా  ఉదయం 5-00 గంటల నుండి  నిత్య పూజకార్యక్రమములు,  అనంతరం ఉదయం 08-00 గంటలకు  మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసము మరియు సరస్వతి దేవి పూజలు నిర్వహించారు .

ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం నిర్వహించారు . ఈరోజు  అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చినారు. ఉదయం 11 గంటలనుండి  శ్రీ సూక్త హోమం నిర్వహించారు .  మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 500 మంది స్వామి వారి అన్న ప్రసాదములు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్ శర్మ, ఆలయ అర్చకులు ,సిబ్బంది గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు