ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా కిరణ్ నియామకం

16-10-2026 | 06:24pm

ఘట్ కేసర్, అక్టోబరు 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా పి. కిరణ్(P. Kiran as Ghatkesar Inspector) నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్ కు చెందిన ఆయనను సీపీ కార్యాలయం నుండి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) కు బదిలీ చేశారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా సంవత్సరం కు పైగా పనిచేసిన బాలస్వామిపై అవినీతి, అవకతవకలు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

ఈమేరకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా కిరణ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఐ కిరణ్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు