చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భైంసా (విజయక్రాంతి) : ముధోల్ నియోజకవర్గం(Mudhol Constituency)లోని బాసర గ్రామంలో(Basara village) షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి(Shaadi Mubarak Kalyana Lakshmi Scheme) పథకం కింద మంజూరైన చెక్కులను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్(Mudhol MLA Pawar Ramarao Patil) శుక్రవారం పంపిణీ చేశారు. మొత్తం 37 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఆయన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇచ్చేవరకు బిజెపి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, తాసిల్దార్ పవన్ చంద్ర పాల్గొన్నారు గ్రామస్తులు పాల్గొన్నారు