అక్రమ ఇసుక రవాణాపై బెజ్జూర్ పోలీసుల చర్యలు
బెజ్జూర్ అక్టోబర్ 16 (విజయక్రాంతి ) : బెజ్జూర్ పోలీస్ స్టేషన్(Bejjur Police Station) పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగ ఇసుక రవాణా(Illegal sand transportation) చేస్తున్న ట్రాక్టర్ ను సలుగుపల్లి గ్రామంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఇసుక విలువ సుమారు రూ.2,000 ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెజ్జూర్ ఎస్ఐ రమేష్(Bejjur SI Ramesh) తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక వ్యాపారం నిర్వహించేవారు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.