శివాజీ నగర్ లో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు

16-10-2026 | 06:14pm

నేరేడుచర్ల, అక్టోబర్ 16(విజయ క్రాంతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేరేడుచర్ల పట్టణంలోని(Nereducherla town) శివాజీనగర్‌లో భవానీ యూత్(Bhavani Youth) ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో(Devotional) నిర్వహించారు.మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు.అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనల్లో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తితో పూజలు చేశారు.చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించడంతో కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.కార్యక్రమంలో భవానీ యూత్ సభ్యులు,కాలనీ వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు