అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలి

16-10-2026 | 06:17pm

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ

కల్వకుర్తి  అక్టోబర్ 16: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను(Dasara Sharannavaratri celebrations) పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు(Special prayers), అర్చనలు నిర్వహించడం ఆనందదాయకమని  ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర పుట్ కార్పొరేషన్ చైర్మన్  శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు.

శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని(Kalwakurthy town) వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో(Vasavi Kanyaka Parameshwari Temple) నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రూ.55,55,555 విలువైన నగదుతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆలయ ట్రస్టు చైర్మన్ జూలూరు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎక్కడ లేని విధంగా కల్వకుర్తిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆధ్యాత్మికత పెంపొందించేందుకు మంచి వేదిక అని అన్నారు.

మరిన్ని వార్తలు