కొమరం భీమ్ విగ్రహావిష్కారణ
ఉట్నూర్, అక్టోబర్ 16( విజయక్రాంతి ): ఆదివాసుల పోరాట వీరుడు కొమరం భీం విగ్రహావిష్కరణకు టిఆర్ఎస్ ( తెలంగాణ రక్షణ సమితి)(Telangana Rakshana Samiti) ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మెస్రం దయాకర్ తనవంతుగా 50,000 అందజేశారు. అక్టోబర్ 23న కుంరం భీమ్ విగ్రహావిష్కరణ కు TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kavitha) ఆదేశాల మేరకు ఖానాపూర్ ఇంచార్జి మెస్రం దయాకర్ తన వంతుగా 50,000/- అక్షరాల యాభై వేల రూపాయల ను కేస్లాపూర్ రాయి సెంటర్ సార్ మేడి మెస్రం వెంకట్రావుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్మేడిలు మెస్రం వెంకట్ రావ్, మెస్రం దుర్గు, మెస్రం చిన్ను, కొట్నాక్ దేవుసావ్, తుడుం దెబ్బ రాస్ట్రా వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపూరావ్, నిర్వహణ కమిటీ చైర్మన్ మెస్రం నగ్నత్, పూర్క చిత్రు,రిట్టే విట్టల్,గెడం భరత్, జూగ్నక్ భరత్ తదితరులు పాల్గొన్నారు.