ఘనంగా వేపకాయల బతుకమ్మ వేడుకలు
16-10-2026 | 06:22pm
కారేపల్లి ఎంపీడీవో కార్యాలయం
కారేపల్లి, అక్టోబర్ 16 విజయక్రాంతి: కారేపల్లి మండల()Karepalli Mandal కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో బి. పద్మ ఆధ్వర్యంలో వేపకాయల బతుకమ్మ వేడుకలను(Vepakayala Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామపంచాయతీలకు(Village Panchayat) చెందిన మహిళా కార్యదర్శులు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు.