ఉట్నూర్‌లో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ..

15-10-2026 | 04:18pm

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

ఉట్నూర్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం రబ్బి సీజన్లో  శనగ పంట సాగు చేసేందుకు సబ్సిడీపై అందజేస్తున్న  శనిగ విత్తనాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, వ్యవసాయానికి అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వం  లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోసం అమలు చేస్తున్న  పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  సూచనలు చేశారు. ఎల్ ని నో ప్రభావంతో తక్కువగా వర్షాలు కురిశాయని, ఈసారి తక్కువ నీటితో వచ్చే  రబ్బి పంటలు సాగు చేయాలని  సూచనలు చేశారు. అధిక నీటి తడులతో  వచ్చే పంటలను తక్కువగా సాగు చేసి  నీటి పొదుపు చేయాలని సూచనలు చేశారు.కార్యక్రమంలో   రైతులతో పాటు  వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు