పోచమ్మ జాతరకు పోలీసు బందోబస్తు

15-10-2026 | 05:28pm

నిర్మల్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి): అడెల్లి శ్రీ మహా పోచమ్మ  గంగనీళ్ల జాతర ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న  నేపథ్యంలో పోలీస్ శాఖ(Police Department) ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పి శ్రీనివాస్(DSP Srinivas) తెలిపారు. గురువారం దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతర పోస్టర్లను  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం అమ్మవారి ఆభరణాలతో గ్రామానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అనంతరం అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఎస్సై రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు