నూతన భవనంలోకి వర్గల్ గ్రంథాలయం

15-10-2026 | 05:33pm

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం 

గజ్వేల్, అక్టోబర్ 15: వర్గల్ గ్రంథాలయాన్ని(Vargal Library) నూతన భవనంలోకి త్వరలోనే తరలిస్తామని జిల్లా గ్రంధాలయ సంస్థ(District Library Authority) చైర్మన్ దరిపల్లి చంద్రం పేర్కొన్నారు. గురువారం గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు నెలకొన్న సమస్యలను లైబ్రేరియన్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అవసరమైన ఫర్నిచర్, కొత్త పుస్తకాలు తదితర సమకూర్చుతామని స్పష్టం చేశారు. మొదటగా ఆయన నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మోహన్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నేతలు అరవింద్ రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, పసుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు